పాత తరం సినిమాల్లో హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లే గుర్తుకు వస్తారు. అయితే సినీ పరిశ్రమకు ఏన్టీఆర్ కన్నా ఏఎన్ఆర్ ముందు వచ్చినా.. పేరు ప్రఖ్యాతలు మాత్రం ఇరువురికీ వచ్చాయి.  తెలుగు కళామతల్లికి ఇద్దరు రెండు కళ్లవంటి వారు అంటారు.  ఆ సమయంలో వీరిద్దరి పోటీ కూడా బాగానే ఉండేదని అంటారు. వీరిద్దరు కలిసి నటించిన పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ కాలంలో దర్శక, నిర్మాతలు అంటే అంత పెద్ద నటులు అయినా సరే ఎంతో గౌరవించేవారు.   ఈ మద్య కొంత మంది నటీ, నటులు దర్శక, నిర్మాతలను చాలా సింపుల్ గా కొటిపడేస్తున్నారని.. కనీసం వాళ్లు వస్తే లేచి నమస్కరించాల్సిన సంస్కృతి కూడా మర్చిపోయారని సీనియర్ నటీ, నటులు ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి.  

 

ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు దర్శక, నిర్మాతలు అంటే ఎంత గౌరవించేవారో ఎన్నోకథనాల్లో చదివాం. తమిళనాట శివాజీ గణేశన్‌ హీరోగా జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన ‘మోటార్‌ సుందరం పిళ్ళై’ బాగా ఆడింది. అంతమంచి సినిమా తెలుగు లో ఏఎన్ఆర్ తో తీయాలని  ‘మధు పిక్చర్స్‌’ నిర్మాత పి.మల్లికార్జునరావు అనుకున్నారు. కాకపోతే ఈ పాత్రల నడి వయసులో ఉన్న ఓ తండ్రి పాత్ర.. ఆ పాత్ర వేయాలంటే ఎంతో గట్స్ ఉండాలి.  నడి వయసులో పిల్లల తండ్రి పాత్రలో తనను చూసేందుకు అభిమానులు అంగీకరించరంటూ ఏయన్నార్‌ వద్దన్నారట.

 

అప్పుడు ఓ రోజు జెమినీ అధినేత ఎస్‌.ఎస్‌.వాసన్‌ ‘మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను’ అంటూ నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశారట. ‘మీరు పెద్దవారు. నా వద్దకు రావడమేమిటి? నేనే వస్తాను’ అంటూ ఏయన్నార్‌ చెబుతున్నా వాసన్‌ పనిగట్టుకుని వచ్చారట. ఈ సినిమా మీరు అయితేనే సరైనా న్యాయం చేస్తారని.. హూందాగా ఉంటుందని ఆయన కోరారట. మీరు నటిస్తేనే ఈ పాత్రకు నిండుదనం వస్తుంది  అంటూ ఏయన్నార్‌ని ఒప్పించారట. ఫలితంగా ‘మంచి కుటుంబం’ రూపొందింది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: