తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం తమ అందంతో అభినయం తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ స్టార్  హీరోయిన్ గా ఎదుగుతూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని... స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమ లో తన హవా నడిపించిన హీరోయిన్ల లో ఒకరు ఆర్తి అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఆర్తి అగర్వాల్ ఎంతగా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆర్తి అగర్వాల్ ఏ సినిమా లో చూసిన ఏ హీరో సరసన చూసిన దర్శనమిచ్చేది. ముక్యంగా  అప్పట్లో తరుణ్ ఉదయ్ కిరణ్ తో కలిసి ఆర్తి అగర్వాల్ నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి అని చెప్పాలి. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది ఆర్తి అగర్వాల్. అదే సమయంలో నటిగా కూడా ఒక ప్రత్యేకమై న గుర్తింపు సంపాదించింది, ప్రతి సినిమా లో ప్రతీ పాత్ర లో తన నటన తో కూడా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఆర్తి అగర్వాల్.


 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన హవా నడిపించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని సెన్సేషన్ సృష్టించింది  ఆర్తీఅగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆర్తి అగర్వాల్ అందానికి నటనకు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: