తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం తో పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన  నిన్నటి తరం హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా నిన్నటి తరం హీరోయిన్లలో తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్ర లతో ఎంతగానో దగ్గరైన హీరోయిన్ రోజా. రోజా అప్పట్లో హీరోలకు ధీటుగా నటిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్నో గ్లామరస్ పాత్రల్లో  కూడా నటించి తన అభినయంతో అందంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది రోజా.


 నిన్నటి తరం హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా... హీరోలకు సరి దీటుగా డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ... హీరోలతో పోటీపడి నటిస్తూ ప్రతీ పాత్రలో కూడా నటిగా మెప్పించింది హీరోయిన్ రోజా.అంతేకాదు లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కూడా అప్పట్లో దర్శకులు అందరికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది,

ముఖ్యంగా రోజా ప్రధాన పాత్రలో  లేడి ఓరియంటెడ్ సినిమా గా తెరకెక్కిన సమ్మక్క సారక్క సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో  తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది రోజా. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించిన రోజా... ప్రతీ పాత్రలో కూడా తన వైవిధ్యమైన నటనతో ఎంతగానో మెప్పించింది అనే చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: