టాలీవుడ్ లో ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కోసం జనాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నా సరే ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్  పోషించిన పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టత మాత్రం రావడం లేదు. 

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. హీరోయిన్ గా దాదాపుగా పది మంది పేర్లు వినిపించాయి గాని ఎవరు చేస్తారు అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఇక ఇప్పుడు మరో పేరు కూడా వినపడుతుంది. ముందు ఇలియానా చేస్తుంది అని అనుష్క చేస్తుంది అని ఎవరికి తోచింది వాళ్ళు కామెంట్ చేసారు గాని ఎవరు చేసేది మాత్రం చిత్ర యూనిట్ చెప్పడం లేదు. ఇక ఇప్పుడు వచ్చిన మరో వార్త ఏంటీ అంటే తమన్నా ఈ సినిమాలో పవన్ తో రోమాన్స్ చేసే అవకాశం ఉంది అని. 

 

తమన్నాను చిత్ర యూనిట్ అడగగా ఆమె ఓకే చేసింది అని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమెకు భారీగా ఇవ్వడానికి కూడా ఓకే చెప్పారు అని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ గా ఉంటుంది అని అందుకే ఎవరూ కూడా ముందుకు రావడం లేదు అని కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: