కరోనా సమయంలో కూడా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం దూకుడును తగ్గించలేదు. అంద‌రూ స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు క‌రోనాకు భ‌య‌ప‌డి ఇళ్ల‌ల్లో కూర్చుని స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. వ‌ర్మ మాత్రం ఎంచ‌క్కా ఇంట్లో నుంచే సినిమాల మీద సినిమాలు చుట్టేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే వ‌ర్మ  'నేకెడ్ (నగ్నం)' ట్రైలర్స్ ఇంటర్నెట్ లో సెన్షేషన్ గా మారాయి. ఇటీవ ల రిలీజ్ అయిన ఈ సినిమాలో ఓ ఇంటి ఓవ‌న‌ర్ పనోడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంటే చివ‌ర‌కు ఏం జ‌రిగింది ? అన్న కాన్సెఫ్ట్‌తో సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. 

 

ఇక ఈ న‌గ్నం సినిమా ఇప్ప‌టికే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. వ‌ర్మ పిచ్చి పైత్యానికి ప‌రాకాష్ట అన్న విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ రాపాక ఆ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న అమ్మాయిగా న‌టించింది. ఇక ఆమె అసలు పేరు శ్రీ రాపాక కాగా... వర్మ ఆమెను స్వీటీగా మార్చారు. స్వీటీ సినిమా ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. ఆమె గ‌తంలో ప‌లువురు టాప్ హీరోలు, హీరోయిన్ల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కూడా ప‌నిచేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె సీనియ‌ర్ హీరో బాల‌య్య గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

 

బాల‌య్య వ్య‌క్తిత్వంపై మాట్లాడిన శ్రీ రాపాక తాను ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు పని చేశానని స్వీటీ చెప్పింది. ఓ సారి డిస్కషన్ కోసం బాలయ్యగారి ఇంటికి వెళ్లానని చెప్పిన ఆమె ఆయ‌న కు కోపం ఎక్కువ అని అంద‌రూ అనుకుంటార‌ని.. కానీ ఆయ‌న చాలా మంచి మ‌నిషి అని చెప్పింది. త‌న లాగే ఆయ‌న‌కు కూడా షార్ట్ టెంప‌ర్ అని... క్ష‌ణాల్లో కోపం రావ‌డం.. వెంట‌నే త‌గ్గిపోవ‌డం జ‌రుగుతూ ఉంటాయ‌ని చెప్పింది. ఇక బాల‌య్య స్త్రీల‌కు ఎంతో గౌర‌వం ఇస్తార‌ని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: