ఏ భాషలో అయినా సరే నయనతార చాలా మంచి నటి. ఏ భాషలో ఆమె సినిమా చేసినా సరే ఆ భాష లో ఆమె తన ఇమేజ్ కి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. పాత్రలో గనుక ఆమెకు ప్రాధాన్యత ఉంటే ఆమె చాలా అందంగా నటిస్తూ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె తమిళం లో ఎక్కువగా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా  ఆమెకు మంచి పేరే తెస్తున్నాయి. ఇక మన తెలుగు లో ఆఫర్లు వచ్చినా సరే ఆమె పెద్దగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అనే టాక్ వస్తుంది. 

 

మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమె ఇక్కడ అసలు సినిమాలు చేయడానికి గానూ ముందుకు రావడం లేదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏంటీ అంటే ఆమె క్రిష్ పవన్ సినిమాలో నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఆమె పవన్ కళ్యాణ్ భార్య గా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి నిజమా కాదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు గాని దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

సినిమా ప్రస్తుతం దాదాపుగా షూటింగ్ కి వెళ్ళే దశలో ఉంది. ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఈ సినిమా మాత్రం దాదాపు రెండేళ్ళ వరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా  ఎప్పుడు వస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: