కొన్నేళ్ల క్రితం మన తెలుగు సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ హవా ఎంతో బాగా నడిచింది. ముందుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన మణిశర్మ, ఆపై ఆయన తీసిన అంతం సినిమాకు కూడా పని చేసారు. వాటి తరువాత వచ్చిన సూపర్ హీరోస్, ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా సినిమాలు మణిశర్మ కు మంచి బ్రేక్ ని ఇచ్చాయి. అక్కడి నుండి ప్రారంభం అయిన మణిశర్మ మ్యూజిక్ కెరీర్, మెల్లగా అనంతికాలంలోనే ఎంతో ఊపందుకుని, ఒకానొక సమయంలో ఎంతో పీక్స్ కు చేరింది. 

IHG's film- <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> express

ఆపై కొన్నేళ్ల పాటు నిర్విరామంగా వరుసగా సినిమాలతో మణిశర్మ ఎంతో బిజీ బిజీగా కొనసాగారు. అయితే కొన్నేళ్ల అనంతరం కాలం మారడం, నూతన సంగీత దర్శకుల రాకతో మణిశర్మకు మెల్లగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడి నుండి మెల్లగా దేవిశ్రీప్రసాద్, థమన్ వంటి వారి హవా మొదలవ సాగింది. ఆపై వారిద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు అవకాశాలతో దూసుకెళ్లారు. అయితే మళ్ళి ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళి పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు మళ్ళి మణిశర్మను తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు తన మ్యూజిక్ కు విరామం ఇవ్వని మణిశర్మ, మధ్యలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలానే మధ్యలో కొన్ని సినిమాలకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చిన మణి, ఇటీవల వరుసగా కొన్ని సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 

 

వాటిలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల ఫైటర్, మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివల ఆచార్యతో పాటు గోపీచంద్, తమన్నాల సీటిమార్, విక్టరీ వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కలయికలో రానున్న నారప్ప సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు మణిశర్మ లిస్ట్ లో ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలు కనుక మంచి సక్సెస్ లు అందుకుంటే, మణిశర్మకు పూర్వ వైభవం రావడం ఖాయం అని, అలానే ఆపై మెల్లగా ఆయన దెబ్బ కొంత పరోక్షంగా దేవిశ్రీ, థమన్ ల పై పడడం కొంతవరకు ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: