టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా విజయ్ సేతుపతి జనాలకు దగ్గరయ్యాడు. బాబు కి మంచి ఇమేజ్ సైరా సినిమా ద్వారా వచ్చింది. అతను నటించిన పాత్రలో అతను జీవించాడు అని  చాలా మంది అంటారు. మహా అంటే పది  నిమిషాలు ఉంటుంది ఆయన పాత్ర. ఆ పాత్రలో ఆయన చాలా అందంగా చేసాడు అనే విషయం సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆ సినిమా  ఆయనకు చాలా మంచి ఇమేజ్ ని తెచ్చింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు మన తెలుగులో. 

 

ఒక సినిమా  ఉప్పెన. సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరో గా వస్తున్న ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరో ప్రాజెక్ట్ కి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం. మరో ప్రాజెక్ట్ ఏంటీ అంటే మహేష్ బాబు  హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో ఆయన ఒక రాజకీయ నాయకుడి గా కనిపించే అవకాశం ఉంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే మొదలు పెట్టే అవకాశం ఉంది అని సమాచారం. చూడాలి మరి అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది. 

 

ఇప్పటికే ఫస్ట్ లుక్ ని టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఇక ఈ సినిమాతో పాటుగా పుష్ప సినిమాలో కూడా ఆయన నటించే అవకాశం ఉంది అని సమాచారం. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు అయితే చెప్పడం కాస్త కష్టమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: