త్రిష సినిమాలు అనగానే జనాలకు తమిళం లో మంచి క్రేజ్ అనేది ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలను జనాలు అక్కడ బాగానే చూసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. తమిళంలో ఆమెకు ఇంకా ఏ మాత్రం వయసు మీద పడుతున్నా సరే క్రేజ్ అనేది తగ్గలేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆమె కూడా వారి సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆమె మన తెలుగు లో  మాత్రం సినిమాలు అసలు చేయడం లేదు. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమె తెలుగు లో సినిమాలు చేయడం లేదు. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ తెలుగులో సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది. మరి ఏ సినిమా అనేది ఇంకా స్పష్టత అనేది రాలేదు గాని ఆమె మాత్రం చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఆమె ఇప్పుడు రెండేళ్ళ పాటు ఒక ప్రాజెక్ట్ కి తెలుగు లో ఓకే చెప్పారు అని అంటున్నారు. అది క్రిష్ సినిమా అని టాక్. క్రిష్ ఒక స్టార్ హీరో తో ఒక భారీ ప్రాజెక్ట్ ఓకే చేసారు అని సమాచారం. 

 

సదరు ప్రాజెక్ట్ లో రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా  కాదా అనేది ఇంకా ఏ స్పష్టత రాలేదు గాని దీనిపై మాత్రం త్వరలోనే ఒక  క్లారిటీ అనేది వచ్చే సూచనలు  అయితే ఉన్నాయి అనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె తమిళ సినిమాలను కూడా వద్దు అని చెప్పారు అని సమాచారం. మరి నిజమా కాదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: