మన తెలుగు లో ఉపేంద్ర కు మంచి క్రేజ్ అనేది ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు మన తెలుగు లో చాలా ఫాస్ట్ గా ఇమేజ్ వచ్చింది. ఆయన సినిమాలు కాస్త భిన్నంగా ఉన్న నేపధ్యంలో వాటిని జనాలు బాగానే ఆదరించారు అనే చెప్పాలి. ఆయన నటన విషయంలో కూడా మన తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయ్యారు. ఇక దర్శకుడి గా నిర్మాతగా కూడా ఆయన ఆమంచి సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన సినిమాలు ఈ మధ్య కాలంలో కాస్త హిట్ కాకపోవడం తో ఆయన  జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

 

ఆయన సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జనాలకు ఎక్కడం లేదు కూడా. అందుకే ఆయన కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ఒక సినిమా ఉంది. ఇక ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. సర్కారు వారి పాట సినిమాలో ఆయన పాత్ర ఏంటీ అంటే... ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ గా నటిస్తారు అని ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. 

 

దీనిపై ఆయనను ఇప్పటికే చిత్ర యూనిట్ అడిగింది అని ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని సమాచారం. మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఆయనకు భారీగానే లాభం ఇచ్చే ప్రాజెక్ట్ అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. మరి ఇక్కడ ఎప్పుడు చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: