బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో పాపులర్ అయిన బ్యూటీ నోరా ఫతేహి. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో డ్యాన్సింగ్‌ వీడియోలను పోస్ట్ చేస్తూ మరింతగా పాపులర్‌ అయ్యింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించింది బ్యూటీ. ఈ బ్యూటీ ఇన్‌స్టా అకౌంట్‌కు ఏకంగా 14 మిలియన్ల ఫాలోవర్స్‌ అయ్యారు.

 

ఈ ఆనందాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్న నోరా తను చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. గతంలో తాను బెల్లీ డ్యాన్స్ చేసిన మూమెంట్ షేర్ చేసిన బ్యూటీ `14 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ చేరుకున్న సందర్భంగా నా జీవితాన్ని మార్చిన ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. 2018లో బెంగళూరులో జరిగిన మిస్‌ ఇండియా అవార్డ్స్‌ కార్యక్రమంలో చేసిన ఈ డ్యాన్స్‌ పర్పామెన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది` అంటూ కామెంట్ చేసింది.

 

అతి కొద్ది కాలంలోనే నోరా ఈ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లోనే బెస్ట్‌ డాన్సర్‌గా పేరు తెచ్చుకుంది. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో పాటు దిల్ బర్‌, ఓ సఖీ సఖి, కమారియా, గర్మీ లాంటి పాటలతో ఓ రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది నోరా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🧿 Celebrating 14 million with a Throw back of this video which changed my life forever! Impromptu solo during my performance for Miss india awards 2018 Bangalore.. this video BROKE the internet and got me dilbar! I Didn’t prepare for my solo , it was on the spot.. I was just feeling the music😍🔥 And for goodluck i wore the same outfit in the dilbar video too 🦄 Thank u for 14million, what a journey ❤️ 🧿

A post shared by Nora Fatehi (@norafatehi) on

మరింత సమాచారం తెలుసుకోండి: