కీర్తి సురేష్ కష్టం వృథా పోలేదు. ఎన్నో వర్కవుట్స్ చేసి బొద్దుగుమ్మ కాస్తా.. నాజూగ్గా తయారైంది. స్లిమ్ గా.. సింపుల్ గా ఉన్న ఈ న్యూలుక్ బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఒకరు కాదు ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. 

 

కీర్తి సురేష్ తెలుగులో వస్తూనే.. నేను శైలజతో హిట్ కొట్టింది. ఆ వెంటనే.. నేను లోకల్ తో మరో సక్సెస్ అందుకొని.. గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక మహానటితో.. ఉత్తమ జాతీయనటి అవార్డు దక్కించుకొని తన స్థాయి పెంచుకుంది కీర్తి సురేష్. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నా.. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో పెద్ద హీరోలు ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. 

 

మహానటి తర్వాత కీర్తి సురేష్ గుర్తుపట్టలేనంత సన్నంగా తయారైంది. బొద్దుగుమ్మ ఛాయలు ఏమాత్రం కనిపించలేదు. ఎందుకిలా సన్నబడింది.. బొద్దుగుమ్మగానే బాగుందన్న కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే.. ఈ వెయిట్ లాస్ వెనకాల చాలా పెద్ద స్కెచ్చే వేసింది కీర్తి. ఇలా సన్నబడిందో లేదో.. రజినీకాంత్.. మహేశ్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.

 

కీర్తి సురేష్ ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తైలో నటిస్తోంది. మరోవైపు సర్కార్ వారి పాటలో మహేశ్ తో జత కడుతోంది. ఆన్ లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేశ్ పక్కన నటిస్తున్నట్టు చెప్పేసింది. మొత్తానికి మహేశ్, కీర్తి సురేష్ కాంబినేషన్ ను కలిపిన ఘనత దర్శకుడు సుకుమార్ దే. వెయిట్ తగ్గకుండా బొద్దుగా ఉంటే.. మహేశ్ పక్కన నటించే ఛాన్స్ వచ్చేది కాదేమో. సన్నబడి ఇద్దరు సూపర్ స్టార్స్ రజినీకాంత్, మహేశ్ ను తనవైపు తిప్పుకుంది కీర్తి సురేష్. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు.. బొద్దుగుమ్మగా ఉన్న కీర్తి సురేష్ చిక్కినా ఆమెకు మంచే జరుగుతోంది. వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రజినీకాంత్, మహేశ్ సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ఏంటో చూపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: