మెగాస్టార్ చిరంజీవి పేరు పలికితే ఆయన వేసిన డ్యాన్సులే గుర్తొస్తాయి. లయబద్దంగా, ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ.. ఆయనే చేసే డ్యాన్స్ బహుశా భారతదేశం మొత్తం మీద ఆయనొక్కరే అంటే సందేహం లేదు. డ్యాన్సులతో, ఫైట్స్ తో ఆయన సృష్టించిన ప్రభంజనంతో నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ను దశాబ్దాలుగా ఏలుతున్నారు. అటువంటి మెగాస్టార్ కీర్తి కిరీటంలో అద్భుతమైన డ్యాన్సులు వేసిన సినిమాలెన్నో ఉన్నాయి. అన్నింటిలోకి అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమైన పాట అంటే ఘరానామొగుడు సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట..’ పాట.

IHG

 

ఈపాట ప్రతి ఫ్రేములో స్టెప్ ఉంటుంది.. కొత్తగా ఉంటుంది. చిరంజీవి ఒంట్లో ఎముకలు లేవా.. అనిపించేలా ఉంటాయి డ్యాన్స్ మూమెంట్స్. ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్స్ ను చిరంజీవి తనదైన స్టైల్లో వేసి మెస్మరైజ్ చేశారు. ఈపాట నాకు ప్రత్యేకం. ‘చిరంజీవి గారు ఈపాటకు ఎంత కష్టపడి, ఇష్టపడి చేశారో నాకు తెలుసు. నేను కొరియోగ్రఫీలో ఎంజాయ్ చేసిన పాట ఇది’ అని చెప్పుకొచ్చాడోసారి. పాట ఐదు నిముషాలూ ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వనంత మ్యాజిక్ చేశారు చిరంజీవి ఈ పాటలో. కీరవాణి సంగీతం, బాలు గాత్రానికి చిరంజీవి స్టెప్స్ యాడ్ అయి ఈ పాటకు లాంగ్ లైఫ్ ఇచ్చారు.

IHG

 

పాటల్లో చిరంజీవి స్టెప్స్ తోపాటు ఆయన చూపించే హావభావాలు పాటకు మరింత అందాన్ని తెస్తాయి. నార్మల్ స్టెప్ అద్భుతమైన స్టెప్ గా, మంచి స్టెప్ ను ఎవర్ గ్రీన్ గా మార్చేసే డ్యాన్సింగ్ టాలెంట్ చిరంజీవిది. బంగారు కోడిపెట్టలో ఆయన చేసిన డ్యాన్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడానికి ప్రధాన కారణమిదే. ఈపాటకు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు. సినిమా ఘన విజయంలో ఈ పాట కీలకపాత్ర పోషించింది. చిరంజీవి కెరీర్లో ఈపాట నెంబర్ వన్ అనడంలో అతిశయోక్తి లేదు.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: