స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న తన సతీమణి స్నేహ తో కలిసి కేబీఆర్ పార్క్ లో జాగింగ్ కు వచ్చాడు అల్లు అర్జున్. ఆ సమయంలో తీసిన పిక్స్ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో బన్ని, గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించాడు. అయితే ఆ లుక్ పుష్ప కోసమే. ఇటీవల అల..వైకుంఠపురములోతో కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్ని ఈసినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమాలో నటించనున్నాడు. ఈ పాటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సింది కానీ కరోనా వల్ల వాయిదాపడింది.  ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.
 
ఈ చిత్రంలో బన్ని ,లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న పుష్పలో బన్ని సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: