మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడిగా ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా తనకంటూ మంచి పేరు దక్కించుకున్నారు. వాటి అనంతరం పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ నటించిన సినిమా తమ్ముడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కుటుంబ బంధాలు అనుబంధాల నేపథ్యంలో సాగె ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్టూడెంట్ గా కనపడతాడు. 

IHG

ముందు పెద్దగా బాధ్యత తెలియకుండా అల్లరి చిల్లరిగా తిరిగే సుబ్బు అనే యువకుడు, ఆ తరువాత తన అన్న కోసం కఠినాతి కఠినమైన బాక్సింగ్ లో ఎంతో శ్రద్దగా శిక్షణ తీసుకుని, చివరికి బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి తన అన్న కలను సాకారం చేస్తాడు. ఇకపోతే ఆ సినిమాకు రమణ గోగుల సంగీతాన్ని అందించడం జరిగింది. అంతకముందు వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాకు సంగీతం అందించిన రమణ, తొలిసారిగా పవన్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. 

 

 

అప్పట్లో తమ్ముడు సినిమా పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా సినిమాలో తొలి పాటైన మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్ధం వివరిస్తా అంటూ పవన్, అప్పటి స్టూడెంట్స్ ని రిప్రెజెంట్ చేస్తూ తన అద్భుతమైన డ్యాన్స్ లతో అదరగొట్టిన ఆ సాంగ్ మంచి క్రేజ్ ని దక్కించుకుంది. వెస్ట్రెన్ ట్రెండీ బీట్స్ తో సాగే ఆ సాంగ్ లో పవన్ వేసే ఫ్యాషనబుల్ డ్రెస్ లతో పాటు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ కూడా అప్పటి యువతని, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఊపేసాయి. పవన్ కెరీర్ లోని బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ కలిగిన సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటి అని చెప్పకతప్పదు.......!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: