స్టార్ సినిమా టీజర్ వ్యూస్ దగ్గర నుండి సినిమా సంచలన విజయం సాధించే వరకు ప్రతిదీ రికార్డులతో చూస్తారు. ఇక ఈమధ్య బుల్లితెర టి.ఆర్.పి రేటింగ్ ను కూడా చూస్తున్నారు. ఇప్పటికే వెండితెర మీద సూపర్ సక్సెస్ అయిన సినిమాలు బుల్లితెర మీద కూడా అదే రేంజ్ సక్సెస్ అయ్యాయి. కొన్ని సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై ఆడకపోయినా కూడా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటాయి. ఈ లాక్ డౌన్ పిరియడ్ లో కార్తికేయ 90ఎం.ఎల్, నాగ శౌర్య అశ్వద్ధామ సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయినా బుల్లితెర మీద మాత్రం మంచి రేటింగ్స్ తెచ్చుకున్నాయి.

 

అయితే నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా మాత్రం స్మాల్ స్క్రీన్ పై డిజాస్టర్ అయ్యింది. జీ తెలుగులో రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కేవలం 3.80 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. దాదాపు 10 దాకా రేటింగ్ వస్తుందని ఆశించగా నిరాశపరచింది. దీనికి బదులుగా రిపీట్ అయినా కూడా మహేష్ మహర్షి, రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలు మంచి రేటింగ్స్ తెచ్చుకున్నాయి. ఇక నిఖిల్ అర్జున్ సురవరంతో పాటుగా సూర్య ఎన్.జి.కే, కార్తిక్ ఖైది సినిమాలు కూడా ఈ వారం టెలికాస్ట్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.

 

రెండున్నర నెలల తర్వాత ప్రజలంతా బయట పనులకు వెళ్లడం.. ప్రస్తుతం అంతా కరోనా భయంతో ఉండటంతో సినిమా చూసి ఎంజాయ్ చేసే మూడ్ లేదని చెప్పాలి. అందుకే నిఖిల్ అర్జున్ సురవరం సినిమాకు అంత తక్కువ రేటింగ్స్ వచ్చాయి. పండుగ సీజనో లేక లాక్ డౌన్ సీరియస్ గా అమలు చేస్తున్న టైంలో అయితే సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చేవి. కొన్నాళ్లుగా రిలీజ్ వయిదాలు పడుతూ వచ్చిన అర్జున్ సురవరం ఫైనల్ గా లాస్ట్ ఇయర్ నవంబర్ 29న రిలీజై మంచి ఫలితాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: