ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కరోనా సమస్యలతో గత మూడు నెలలలో మూడువేల కోట్ల నష్టం వచ్చింది అన్నఅంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈనష్టాలలో బాలీవుడ్ తరువాత రెండవ స్థానంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఉంది అన్నఅంచనాలు వస్తూ ఉండటంతో ఈనష్టాల నుండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటికి కోలుకుంటుందో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.


ఇలాంటి పరిస్థితులలో అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ కు జక్కన్న ఊహించిన విధంగా మార్కెట్ అవుతుందా అన్న సందేహాలు ప్రస్తుతం రాజమౌళిని కూడ వెంటాడుతున్నట్లు టాక్. దీనికితోడు రానున్న రోజులలో ప్రజలు భారీ సినిమాలు చూడటం కంటే చిన్న సినిమాలను చూసే విషయంలో ఆసక్తి పెంచుకుంటారు అని వస్తున్న అంచనాలు కూడ భారీ సినిమాల దర్శక నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రాబోయే ఆదివారం స్టార్ మా లో ప్రసారంకాబోయే ‘కేజీ ఎఫ్’ ఈప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఇస్తుంది అన్నప్రచారం జరుగుతోంది.


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈమూవీ పెనుసంచలనం సృష్టించడమే కాకుండా ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 380 కోట్ల షేర్ వసూలు చేయడం ఒక  సంచలనం. పాన్ ఇండియా మూవీగా రికార్డులు క్రియేట్ చేసిన ఈమూవీకి ‘కేజీ ఎఫ్ 2’ పేరుతో సీక్వెల్ తీస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ఈఏడాది దసరాకు విడుదల కావలసి ఉంది.


అయితే అప్పటికైనా ధియేటర్లు ఓపెన్ అవుతాయా అన్నసందేహాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈనెల జూలై 5 ఆదివారం నాడు ‘కేజీ ఎఫ్’ చాప్టర్ 1 టెలివిజన్ ప్రీమియర్ ప్రసారంకాబోతోంది. ఈప్రీమియర్ కి టీఆర్పీ ఎలా ఉంటాయి అన్న దానినిబట్టి భవిష్యత్ లో విడుదల కాబోయే భారీ సినిమాల మార్కెట్ ఉంటుంది అనిఅంటున్నారు. అయితే ఇప్పటికే అనేకమంది ఈసినిమాను ఓటీటీ వేదికల పై చూసిన నేపధ్యంలో మళ్ళీమళ్ళీ జనం ‘బాహుబలి’ ని చూసినట్లుగా ఈసినిమాను బుల్లితెర పై కూడ విపరీతంగా చూస్తే భారీ బడ్జెట్ సినిమాల పట్ల జనం అభిరుచి ఏమాత్రం తగ్గలేదు అన్ననిర్ణయానికి రావడమే కాకుండా ‘కేజీ ఎఫ్ 2’ మార్కెట్ తో పాటు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ పై ఈ ప్రీమియర్ షో ప్రభావం ఉంటుంది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: