టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో డాన్స్ విషయానికి వస్తే బాలయ్య ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరూ కూడా డాన్స్ విషయంలో ముందు నుంచి కూడా ప్రాణం పెట్టి చేస్తూ ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిందే. సినిమా ఏది అయినా సరే డాన్స్ విషయంలో ఇద్దరూ కూడా పోటీ పడి చేసే వారు అని అంటారు సినీ జనాలు. డాన్స్ విషయంలో వాళ్ళు పెట్టే శ్రద్ధ చూసి చాలా మంది షాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. డాన్స్ లో ఇద్దరూ కూడా ఈ తరం తో పోటీ పడతారు. బాలకృష్ణ ఇటీవల హీరో గా చేసిన రూలర్ సినిమాలో ఒక పాటకు చేసిన స్టెప్ బాగా ఆకట్టుకుంది. 

 

పైసా వసూల్ సినిమాలో కూడా ఆయన డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. పూరి దర్శకుడి గా వచ్చిన ఆ సినిమాలో ఆయన డాన్స్ విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టి తన ఫాన్స్ ని అలరించారు. ముందు నుంచి కూడా ఆయన డాన్స్ విషయంలో చాలా వరకు శ్రద్ధ పెడుతూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో దాదాపు ఆయనకు డాన్స్ విషయంలో మంచి పేరు ఉంది. చిరంజీవి రేంజ్ లో డాన్స్ చేయలేదు గాని బాలయ్య డాన్స్ కూడా టాప్ అని అంటారు. పాట లో డాన్స్ ఉంటే అందులో బాలయ్య హావభావాలు ఫాన్స్ కి చాలా బాగా నచ్చుతూ ఉంటాయి అనే విషయం చెప్పాల్సిన పని లేదు. 

 

సినిమాకు అన్ని విధాలుగా కూడా బాలయ్య న్యాయం చేస్తారు అని ఆయన సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఇప్పుడు బాలయ్య ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: