బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌ పుత్‌ మరణించి 15 రోజులు దాటిన సినీ పరిశ్రమ ఇంకా ఆ షాక్‌ నుంచి కోలుకోలేక పోతోంది. ముఖ్యంగా సుశాంత్ ఆత్మహత్య కు కారణాలు వెతికే పనిలో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో పోలీసులు కూడా ఆ దిశ గా విచారణ జరుపుతున్నారు.

 

సుశాంత్‌ బంధువులు, ఇండస్ట్రీ వర్గాలు మృతి పై సీబీఐ ఎంక్వయిరీ వేయాలన్న డిమాండ్‌ కూడా తెర మీదకు వస్తోంది. ఇప్పటికే విచారణ జరుపుతున్న పోలీసులుకు ఆసక్తికర విషయాలు తెలిశాయి.  సుశాంత్ సింగ్‌ సెల్‌ ఫోన్ ‌ను ఫోరెన్సిక్‌ టెస్ట్‌ కు పంపిన పోలీసులకు రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫోరెన్సిక్‌ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ సింగ్‌ రాజ్‌ పుత్‌ చివరి క్షణాల్లో తన మొబైల్‌ నుంచి గూగుల్‌లో తన పేరునే సెర్చ్‌  చేశాడని వెల్లడైంది.

 

ఉదయం 10:15 నిమిషాలకు సుశాంత్ తన పేరును గూగుల్‌ సెర్చ్ చేసినట్టుగా ఫోరెన్సిక్‌ ఎక్స్‌ పర్ట్స్‌ గుర్తించారు. అంతేకాదు తన గురించి మీడియాలో వచ్చిన న్యూస్‌ ఆర్టికల్స్‌ను సుశాంత్ చదివినట్టుగా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ లో తేలింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న తరువాత సుశాంత్ తన పేరునే ఎందుకు సెర్చ్‌ చేశాడు. తన గురించి ఆన్ ‌లైన్ ‌లో ఏం తెలుసుకోవాలనుకున్నాడన్న యాంగిల్‌లో పోలీసులు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నారు.

 

సుశాంత్ మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు కోల్పోవడమే కారణమని కొంత మంది చెపుతుంటే, ఆర్థిక సమస్యలు కారణం అయ్యుంటాయని భావిస్తున్నారు. మరికొందరు సుశాంత్ ఎలాంటి సమస్యలు లేవని కేవలం డిప్రెషన్‌ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: