మన తెలుగు లో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వస్తుంది అంటే చాలు తారక్ డాన్స్ ఏ విధంగా ఉంటుంది అని సినీ జనాలు ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా డాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ లో జనాలు ఆయన డాన్స్ కోసమే ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఏ సినిమాలో అయినా సరే తారక్ డాన్స్ ముందు నుంచి కూడా హైలెట్ అవుతుంది అని చెప్పవచ్చు. 

 

ఇక అది అలా ఉంటే తారక్ కెరీర్ లో కొన్ని కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన డాన్స్ విషయంలో పెట్టే శ్రద్ధ చూసి చాలా మంది సినీ విమర్శకులు కూడా షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది ఏంటీ అంటారా... ఆయన సినిమాల్లో డాన్స్ చేసే విషయంలో తనను తాను మార్చుకోవడానికి షూటింగ్ కి ముందు రోజు చాలా వరకు అతను రాత్రి వరకు ప్రాక్టీస్ చేసే సందర్భాలు ఉంటాయట. అవును డాన్స్   షూట్ ఉంది అంటే చాలు అతను మ్యూజిక్ పెట్టుకుని ఏ పాటకు ఏ విధంగా డాన్స్ చెయ్యాలి అనే దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది అంటారు. 

 

తన గది లోకి వెళ్లి ఆ మ్యూజిక్ ని పెట్టుకుని ఆ పాట కోసం అనేక విధాలుగా తారక్ కష్టపడుతూ ఉంటాడు అని చెప్తారు. ఇది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చాలా మందికి తెలియదు గాని విదేశాలకు వెళ్ళే సమయంలో కూడా పాట మ్యూజిక్ ముందుగానే తీసుకుని డాన్స్  ప్రాక్టీస్ చేస్తాడు అని అంటారు. ఆ విధంగా డాన్స్ మాస్టర్ లు కూడా షాక్ అయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: