ఈ తరంలో చాలా వరకు సినిమాల్లో మంచి డాన్సర్ లు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ అల్లు అర్జున్. ఇక వారిని మించి ఈ తరంలో డాన్స్ చేసే వారు పెద్దగా లేరు అనే చెప్పాలి. ఇక కిందటి తరం విషయానికి వస్తే చిరంజీవి, వీరే అంతే గాని ఎక్కువగా మన టాలీవుడ్ లో డాన్స్ విషయంలో పెద్దగా స్టార్ హీరోలు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు అనే చెప్పాలి. అయితే కొందరు హీరోలు మాత్రం డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు అప్పట్లో అని అంటారు. అందులో ప్రధానంగా చెప్పే హీరో కృష్ణ. ఆయన సినిమాల్లో డాన్స్ ఎక్కువగా హైలెట్ అయ్యేది. 

 

ఆయన కెరీర్ మొదట్లో ఆయనకు డాన్స్ వచ్చేది కాదు అని అనేవారు. కాని ఆ తర్వాత ఆయన డాన్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ ఆయనను మంచి డాన్సర్ ని చేసింది అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. ప్రతీ స్టెప్ విషయంలో అప్పుడు ఆయన అనేక జాగ్రత్తలు తీసుకునే వారు. టాలీవుడ్ కి కొత్త డాన్స్ ని పరిచయం చేయడానికి ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేసే వారు. అయితే ఆయన కెరీర్ లో నటనకు ఎక్కువగా మార్కులు పడ్డాయి గాని డాన్స్ కి కాదు. ఆయన సినిమాలు హిట్ అయితే ఆయన నటన హిట్ అయ్యేది గాని డాన్స్ కాదు. 

 

తర్వాత తర్వాత ఆయన డాన్స్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం తో క్రమంగా ఆయన్ను జనాలు ఆదరించారు. ఇక ఆయన సూపర్ స్టార్ అయ్యారు అంటే ఆయన డాన్స్ విషయంలో తర్వాత తర్వాత చూపించిన శ్రద్ధ అని  అందరికి తెలిసిన విషయమే. ఈ తరంలో ఆ రేంజ్ లో డాన్స్ మీద దృష్టి పెట్టే హీరోలు తక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: