టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి అందరికి తెలిసిందే. సినిమాలో డాన్స్ కి ఏ రేంజ్ లో అతను వేల్యూ ఇస్తాడు అనేది అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వస్తుంది అంటే చాలు అతని డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇక ఐటెం సాంగ్స్ విషయానికి వస్తే తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ విషయంలో అతను చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అతని సినిమాలు జనతా గ్యారేజ్ తో పాటుగా టెంపర్ సహా అరవింద సమేత సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఆయా సినిమాల్లో ఉన్న  ఐటెం సాంగ్స్ లో అతని డాన్స్ చూసి చాలా మంది షాక్ అయ్యారు అంటే ఏ రేంజ్ లో అతను డాన్స్ కి ప్రాధాన్యత ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రతీ స్టెప్ కూడా అతను ఒక రేంజ్ లో చేసాడు అనేది ఆ సినిమాలు చూస్తే స్పష్టం గా అర్ధమవుతు ఉంటుంది. సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది అంటే ఆ సినిమాలో అతని డాన్స్ అంతకు మించి విజయం సాధిస్తుంది అని ఆయన సినిమాలు చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా అతను డాన్స్ కి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అంటున్నారు. 

 

సినిమా వచ్చే ఏడాది రానుంది. జనతా గ్యారేజ్ సినిమాలో మొదటి పాట ప్రణామం లో అతను ఒక స్టెప్ వేస్తాడు. ఆ స్టెప్ చూసి జనాలు లేచి ఈలలు వేసారు. ఆ సినిమాలో డాన్స్  ఒక రేంజ్ లో హైలెట్ అయింది. అలా తని సినిమాల్లో డాన్స్ కి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: