టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. వారికి ఏ రేంజ్ లో మంచి పేరు ఉన్నా సరే వాళ్ళు తమ పేరు ని కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కూడా రాజీ అనేది పడే అవకాశం ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరోలుగా ఉన్న ఇమేజ్ ని కాపాడుకోవడానికి గానూ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే దాదాపుగా అంతే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో డాన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత అనేది పెరిగింది అనే విషయం దాదాపుగా అందరికి తెలుసు. 

 

డాన్స్ విషయంలో జాగ్రత్త అనేది లేకపోతే సినిమా ఫ్లాప్ అయినా సరే ఆశ్చర్యం లేదు. అందుకే స్టార్ హీరోలు చాలా వరకు మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యే విధంగా డాన్స్ మీద బాగా దృష్టి సారిస్తున్నారు అనే చెప్పాలి. టాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు డాన్స్ మీదనే సినిమా కమర్షియల్ అనేది ఆధారపడి ఉంది. రామ్ చరణ్ హీరో గా వచ్చిన రంగస్థలం సినిమా చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సినిమాలో రామ్ చరణ్ చేసిన డాన్స్ ఇందుకు నిదర్శనం. ఆ సినిమాలో ఆయన ఐటెం సాంగ్  లో ఒక రేంజ్ లో డాన్స్ చేసారు అనే చెప్పాలి. 

 

ఆ సినిమాలో ఆయన డాన్స్ చూసిన సినీ విమర్శకులు కూడా ఒకానొక సందర్భంలో షాక్ అయ్యారు అంటే ఆయన ఏ రేంజ్ లో డాన్స్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం ఆయన నటన డాన్స్ కూడా అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక సినిమాలో చేస్తున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: