ఎస్వీ రంగారావు పేరు అనుకుంటే చాలు వెండితెర మీద బరువైన పాత్రలు అలా  మెదడుతో కదలాడతాయి. ఆయన విశ్వ నట చక్రవర్తి, ఆయన నటించిన నర్తనశాల సినిమాలోని కీచకుడి పాత్రకు అంతాతీయ అవార్డు దక్కింది. భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అయనకు లభించింది. 

 

ఎస్వీయార్  అసలు పేరు సామర్ల వెంకట రంగారావు. ఆయన దాదాపుగా మూడు వందల చిత్రాల్లో నటించారు. కీచకుడు, రావణుడు, హిరణ్య కశిపుడు, రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు వేయాలంటే ఎస్వీయార్ వల్లనే సాధ్యం. ఆయనకు సాటి పోటీ మరొకరు లేరని చెప్పాలి

IHG

ఎస్వీయార్ నటుడే కాదు, దర్శకుడు కూడా. ఆయన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో బాంధవ్యాలు తీసి నంది అవార్డు సాధించారు. ఇక ఆయన చదరంగం అనే మరో సినిమాకు కూడా దర్శకత్వం చేశారు. తన కుమారుడు కోటేశ్వరరావుని నటుడిగా చేయాలనుకుని సినిమా తీసి కొంత చిత్రీకరణ జరిపారు కూడా. ఎందుకో అది ఆగిపోయింది. 

IHG

ఇవన్నీ ఇలా ఉంటే ఎస్వీ రంగారావు విశాఖ మిసెస్ ఏవీఎన్ కళాశాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ కళాశాల నుంచి మొత్తం 45 మంది విద్యార్ధులు ఆ ఏడాది పరీక్ష రాస్తే పాస్ అయిన ఏకైక‌ విద్యార్ధిగా ఎస్వీయార్ నిలవడం అరుదైన ఘటనగా చెప్పాలి. ఇక ఆయనకు అనకాపల్లిలో సన్మానం జరగడం గొప్ప విషయంగా చెబుతారు. 

IHG

ఎస్వీయార్ కి ఏనాడో పద్మశ్రీ వంటి పురస్కారాలు రావాలి. కానీ అవి దక్కలేదు.  దాని వెనక అనేక రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెబుతారు. అయితే వాటి కంటే మిన్నగా అయన జనం గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. ఎస్వీయార్ బహుముఖ ప్రతిభాశాలి. రచయిత, డైరెక్టర్, యాక్టర్, హీరో, విలన్ అన్నీ ఆయనలోనే ఉన్నారు. ఆయన ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మేటి నటుడుగా చెప్పాలి.

IHG

ఎస్వీయార్ 1918 జూలై 3న క్రిష్ణా జిల్లా నూజివీడులో పుట్టారు. 1974 జూలై 18న గుండెపోటుతో మద్రాస్ లో మరణించారు. ఆయన నటించిన చివరి చిత్రాలు చక్రవాకం, యశోదా క్రిష్ణ. చిత్రమేంటంటే ఈ సినిమాల్లో ఆయన పాత్రలు పూర్తి చేయకుండానే పోవడంతో వాటిని అలాగే ఉంచేసి సినిమా కధ నడిపించేశారు.  ఈ రోజు ఆయన జయంతి వేళ అభిమాన జనం నివాళులు ఇవే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: