తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినపడితే ఆయన వేసిన డ్యాన్సులే గుర్తొస్తాయి. లయబద్దంగా, ఇష్టపడి, ఎంజాయ్ చేస్తూ.. ఆయనే చేసే డ్యాన్స్ బహుశా భారతదేశం మొత్తం మీద ఆయనొక్కరే అంటే సందేహం లేదు. డ్యాన్సులతో, ఫైట్స్ తో ఆయన సృష్టించిన ప్రభంజనంతో అగ్ర  హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్నారు. అటువంటి చెర్రీ అద్భుతమైన డ్యాన్సులు వేసిన సినిమాలెన్నో ఉన్నాయి. అన్నింటిలోకి అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమైన పాట అంటే రచ్చ సినిమాలోని ‘డిల్లక్ డిల్లా..’ పాట.

 

 


ఈ పాట ప్రఠీ స్టెప్ అందంగా కొత్తగా ఉంటుంది. చరణ్ స్టెప్పులు అదిరిపోయాయి.. అనిపించేలా ఉంటాయి డ్యాన్స్ మూమెంట్స్.  ఈపాట నాకు ప్రత్యేకం.రామ్ చరణ్ ఈపాటకు ఎంత కష్టపడి, ఇష్టపడి చేశానో నాకు తెలుసు. ఆ పాత మ్యూజిక్, స్టెప్పులు నాకు బాగా నచ్చాయని చెర్రీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ పాట నాలుగున్నరా నిమిషాలు  ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వనంత మ్యాజిక్ చేశారు చెర్రీ ఈ పాటలో. మని శర్మ  సంగీతం,టిప్పు, గీతామాధురి గాత్రానికి చరణ్ స్టెప్స్ యాడ్ అయి ఈ పాటకు లాంగ్ లైఫ్ ఇచ్చారు.

 

 

పాటల్లో చెర్రీ స్టెప్స్ తోపాటు ఆయన చూపించే హావభావాలు పాటకు మరింత అందాన్ని తెస్తాయి. నార్మల్ స్టెప్ అద్భుతమైన స్టెప్ గా, మంచి స్టెప్ ను ఎవర్ గ్రీన్ గా మార్చేసే డ్యాన్సింగ్ టాలెంట్ ను తండ్రి నుంచి చెర్రీ పుణికి పుచుకున్నాడు. డిల్లకు డిల్లా లో  ఆయన చేసిన డ్యాన్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడానికి ప్రధాన కారణమిదే. ఈపాటకు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పట్టం కట్టారు. సినిమా ఘన విజయంలో ఈ పాట కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: