జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన టెంపర్ సినిమా లో తారక్ నటనకి డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. 2015 వరకు ఎటువంటి హిట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి పూరి జగన్నాథ్ టెంపర్ రూపంలో అతిపెద్ద హిట్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. తారక్ ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించిన పూరి జగన్నాథ్ ని నందమూరి అభిమానులంతా ప్రశంసించారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ పెద్ద హైలెట్ గా పరిగణించవచ్చు. అతడు సిక్స్ ప్యాక్ బాడీ పెంచి అభిమానులకు కన్నుల విందు చేశాడు. క్లైమాక్స్ సన్నివేశం లో జూనియర్ ఎన్టీఆర్ చూపించిన నటనా చాతుర్యానికి ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులు అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు.


ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటన తో పాటు తన అద్భుతమైన నాట్య ప్రదర్శన తో వావ్ అనిపించాడు తారక్. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. భాస్కరభట్ల కందికొండ, విశ్వ రాసిన పాటలు చాలా అర్థవంతంగా సన్నివేశాలకు అనుగుణంగా ఉండటం మ్యూజికల్ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. వన్ మోర్ టైం, చూలేంగే అస్మా, దేవుడా దేవుడా, ఇట్టాగే రెచ్చి పోదాం పిల్ల, టెంపర్ టైటిల్ పాట చాలా స్పెషల్ గా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.


ఈ అన్ని పాటలలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నాట్యం చేసే మళ్లీ తన నాట్య నైపుణ్యాన్ని చెప్పకనే చెప్పేశాడు. టెంపర్ టైటిల్ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మెలికలు తిరిగి పోతూ పాట మొత్తం లో ఒక్కడే అందర్నీ ఆకర్షించాడు. ఈ పాటలో తన డాన్స్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. నిజానికి టెంపర్ టైటిల్ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కి సైమా 2016 అవార్డ్స్ లో ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది. జానీ మాస్టర్ డాన్స్ ఎలా నేర్చుకుంచాడో అంతకంటే అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై సూపర్ గా డాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసేసాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: