ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో నెంబర్ వన్ డాన్సర్ గా ఉన్న హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ఎంతగానో అనుభవం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాక తనదైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఇరగదీశాడు. ఎలాంటి క్లిష్టమైన స్టెప్స్  అయినా తనదైన స్టైల్ లో చేసి చూపించి తెలుగు ప్రేక్షకులందరికీ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ సినిమా వచ్చిన అందులో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. 

 

 

 ఇక ఈ మధ్య కాలంలో అయితే మరింత డెడికేషన్ తో ఎంతో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు  జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే నటన లో తాతకు తగ్గ మనవడి గా... నటనకు ప్రతిరూపంగా ఎంతో మంది అభిమానుల ను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. డాన్సుల విషయంలో కూడా తనదైన శైలిలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ తనకు ఎవరూ సాటి లేదు అని నిరూపించుకుంటున్నారు.. 

 

 

 

 అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో  ఎంతో డిఫరెంట్ లుక్ తో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఇరగదీశాడు. ముఖ్యంగా సినిమాలో  ఫాలో ఫాలో అనే సాంగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. ఇక ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పర్ఫామెన్స్ కి తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఎంతో స్టైల్గా అద్భుతంగా డాన్స్ పర్ఫామెన్స్ చేసి   తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: