మామూలుగానే తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ పర్ఫార్మెన్స్ లకి కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో రామ్ చరణ్. మరి మెగాస్టార్ చిరంజీవి తనయుడు అంటే డాన్స్ విషయంలో ఎంతలా ఇరగదీస్తాడో  అని భారీ అంచనాలు ఉంటాయి. దీంతో రామ్ చరణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడా చేయడ అని ముందుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. 

 

ఇక రామ్ చరణ్ కూడా ప్రేక్షకుల అంచనాలను సంతృప్తి పరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బెస్ట్ డాన్సర్ లో రామ్ చరణ్ ఒకరు గా ఉన్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన ప్రతి సినిమాలో  కూడా తనదైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడు అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్సుల్లో  ఏ హీరోకి సాధ్యం కానీ ఒక యూనిక్ స్థాయిలో వుంటుంది. అందుకే రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. 

 

 అయితే రామ్ చరణ్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీసిన సాంగ్ లలో ఒకటి నాయక్ సినిమా లోని లైలా ఓ లైలా సాంగ్. రామ్ చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా నాయక్. ఇక ఈ సినిమాలో  లైలా ఓ లైలా అనే సాంగ్ లో  రామ్ చరణ్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి  తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఇది కదా మా డాన్స్ దేవుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అని మురిసిపోయారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి వారసుడు అంటే ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ లే ఉండాలి అని అనుకున్నారు అభిమానులు .

మరింత సమాచారం తెలుసుకోండి: