చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. దాదాపుగా సగం సినిమా షూటింగ్ పూర్తి అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగానే కాకుండా మరో కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టాలీవుడ్ లో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారు అని కొందరు లేదు వేసవిలో అని కొందరు లేదు ఈ ఏడాది దసరా కు విడుదల చేస్తారు అని మరి కొందరు అంటున్నారు. 

 

మరి నిజమా కాదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు లేదా రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం జగపతి బాబు ని కూడా తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక అది అలా ఉంటే ఆయన ఈ సినిమా తర్వాత లూసిఫర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో కూడా కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. 

 

అదే విధంగా ఆయన తో పాటుగా వివేక్ ఒబెరాయ్ కూడా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. అది నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు గాని దీనిపై త్వరలోనే స్పష్టత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాను సుజిత్ దర్శకత్వంలో తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొంత గ్యాప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఆయన ఏ సినిమాలో తర్వాత చేస్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: