తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో కొంతమంది డాన్స్ పర్ఫార్మెన్స్ లకు దూరంగా ఉంటే మరి కొంతమంది అదిరిపోయే డాన్స్ స్టెప్పులు తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ హీరోలు  అయిన నాగార్జున వెంకటేష్లు మొదటి నుంచీ కాస్త డ్యాన్స్కు దూరంగానే ఉన్నారు. అదే సమయంలో బాలకృష్ణ చిరంజీవి లు తమదైన డాన్స్ పర్ఫార్మెన్స్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించారు. అయితే అక్కినేని నాగార్జున యువసామ్రాట్ గా టాలీవుడ్ మన్మధుడు ఎంతగానో క్రేజ్  సంపాదించినప్పటికీ... డాన్స్ పరంగా మతం అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వలేకపోయారు. 

 

 కానీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాటలో తనదైన సింపుల్ స్టెప్స్ తో ఆకర్షించారు అక్కినేని నాగార్జున. అంతేకాదు కొన్ని పాటలలో అక్కినేని నాగార్జున చేసిన స్టెప్స్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్  సృష్టించాయి అనే చెప్పాలి. చూడటానికి అవి సింపుల్ స్టెప్స్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ఆకర్షించి ఆకట్టుకున్నాయి ఆ స్టెప్స్ . ఇక ఇలా నాగార్జున డాన్స్ పెర్ఫార్మెన్స్ తో  ఇరగదీసిన  పాటలలో ఒకటి కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్. 

 

 అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసి సంచలనం సృష్టించిన సినిమా హలో బ్రదర్. సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో నాగార్జున కన్నె పెట్టరో కన్ను కొట్టరో అనే పాట లో చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ పాటలో నాగార్జున చేయి అలా ముందుకు పెట్టి జంపు చేస్తున్న స్టెప్ అయితే.. ప్రేక్షకులందరికీ ఫేవరెట్ గా మారింది అని చెప్పాలి. ఇలా కష్టమైన స్టెప్స్ తో కాకుండా తనదైన  స్టెప్స్ తో  ప్రేక్షకులను అలరించారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: