ప్రస్తుతం మొదటి నుంచి డాన్స్ పర్ఫార్మెన్స్ లకు కాస్త దూరంగా ఉన్న హీరోలలో  ఒకరు గా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. నటన పరంగా అందం పరంగా తనకు ఎవరూ సాటి లేరు అని నిరూపించుకున్నప్పటికీ  డాన్స్ పరంగా మాత్రం అంతలా ప్రేక్షకులను మెప్పించలేక పోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీస్తున్నారు  అనే చెప్పాలి. యువ హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా ప్రస్తుతం మహేష్ బాబు డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఉన్నాయి. డాన్స్ విషయంలో ఎంతో డెడికేషన్ చూపిస్తున్న మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. 


 అయితే మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాలో యు ఆర్ మై లవ్ అనే  పాటలో  అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరిచిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో  కూడా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా మొదలైన కొద్ది సేపటికే వచ్చే డాంగ్  డాంగ్  అనే పాటలో  మహేష్ డాన్స్ సూపరో సూపర్ అనక తప్పదు. ఆర్మీ క్యాంప్ కి గెస్ట్ గా వచ్చిన తమన్న తో మహేష్ బాబు కలిసి స్టెప్పులు వేస్తారు. 


 ఇక ఈ పాటలో అదిరిపోయే ఎంతో కష్టమైన స్టెప్స్ కూడా వేసి అభిమానులను ఎంతగానో మైమరిపింప చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ పాట చూస్తున్నంతసేపు డాన్స్ విషయంలో మహేష్ బాబు ఎంతలా డెడికేషన్ చూపిస్తున్నారో  అనే విషయం ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. మామూలుగానే తమన్నా మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే.. అలాంటి తమన్నాతో డాన్స్ స్టెప్పులు వేసి తమన్నా కంటే ఎక్కువ గ్రేస్ గా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే ఈ పాట ప్రేక్షకులందరికీ సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: