ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శకుంతలా దేవి. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం ఆదారంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా విడుదలకానుంది. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. జూలై 31నుండి ఈచిత్రం స్ట్రీమింగ్ లోకి వస్తుందని తాజాగా ప్రైమ్ ప్రకటించింది. అను మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వికాస్ మల్హోత్రా నిర్మించాడు. 
ఇక ఈసినిమానే కాకుండా బాలీవుడ్ నుండి త్వరలో మరో ఎనిమిది సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి ల్లో విడుదలకానున్నాయి. అందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన  చివరి చిత్రం దిల్ బెచార.. జూలై 24న డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రానుండగా మచ్ అవైటెడ్ మూవీ లక్ష్మి బాంబ్, భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా ,సడక్ 2, ది బిగ్ బుల్, ఖుదాఫీజ్ ,లూట్ కేస్ సినిమాలు డిస్నీ +హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది వీటితోపాటు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా కూడా డైరెక్ట్ గా విడుదలకానుంది. నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: