బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. గత నెల 20న ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో శ్వాస సమస్యలతో చేరిన ఆమె, ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సరోజ్ ఖాన్  మరణం బాలీవుడ్ ని విషాదంలో ముంచేసింది. ఆమె ఎంతో మంది నటీ, నటులను మంచి డ్యాన్సర్లుగా వెండి తెరపూ చూపించారని.. అంతగొప్ప డ్యాన్సర్ మళ్లీ చూడలేం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నటీనటులు.. గ‌తంలో ఆమెకి సంబంధించిన జ్ఞాప‌కాలని నెమ‌రు వేసుకుంటున్నారు.

IHG

బెబో క‌రీనా స‌రోజ్ ఖాన్ నుండి తాను ఎంత‌గా నేర్చుకున్న‌దో, ఆమె నుండి ఎలాంటి స‌ల‌హాలు స్వీక‌రించిందో వివ‌రించింది. మాస్ట‌ర్ జీ .. నాకు ఎప్పుడు ఓ విష‌యం చెబుతూ ఉండేవారు.  చేతులు, కాళ్ళు కదల్చలేకపోతే  మీ ముఖంతో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఉందని అనేవారు. ఆమెలా హావభావాలు పలికించాలని... నేను బాత్‌రూంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని... ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Master ji always told me... perrr nahin chala saktiii toh kam se kam face toh chalaaaaa. That’s what she taught me... to enjoy dancing, smile and smile through the eyes. There can never be another... dance and expression can never be the same for us actors and for everyone who loved her... love you master ji. Till we dance again... RIP 💔 #SarojKhan

A post shared by kareena kapoor Khan (@kareenakapoorkhan) on

 

ప్రముఖ బాలీవుడ నటి మాధురీ దీక్షిత్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణ వార్త విని కృంగిపోయారు.  ఏక్ దో తీన్.., చోలీ కే పీచే.., ద‌క్ ధ‌క్ క‌ర్నే ల‌గా.., మార్ దాలా లాంటి సాంగ్స్‌తో బాలీవుడ్ భామ మాధురి ధీక్షిత్ సినీప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసింది. అయితే ఆ పాట‌ల‌కు కొరియోగ్రాఫ్ చేసింది మేటి డ్యాన్స‌ర్‌ స‌రోజ్‌ఖాన్‌.  ప్ర‌ఖ్యాత డ్యాన్స‌ర్ స‌రోజ్ మృతి ప‌ట్ల మాధురి తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేసింది.  స‌రోజ్‌ఖాన్‌ను గురువుగా భావిస్తున్న మాధురి.. ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఆ డ్యాన్స‌ర్‌కు నివాళి అర్పించింది. ఓ అద్భుత‌ నైపుణం ఉన్న వ్య‌క్తిని ఈ ప్ర‌పంచం కోల్పోయింద‌ని, త‌న‌ను మిస్ అవుతున్నాన‌ని, వారి కుటుంబ‌స‌భ్యులు సంతాపం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మాధురి త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: