ఇండియన్ మూవీ లవర్స్ పాటలకు, డ్యాన్సులకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. భారతీయ సినిమాల్లో మదర్ ఆఫ్ కొరియోగ్రఫీగా పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ‘సరోజ్ ఖాన్’. తన మార్క్ డ్యాన్సులతో ఎనభై, తొంభైల్లో శ్రీదేవి, మాధురి దీక్షిత్ నెంబర్ వన్ హీరోయిన్లు కావడంలో తన వంతు పాత్ర పోషించారు. అయితే.. సరోజ్ ఖాన్ కు తెలుగు సినిమాలతో కూడా మంచి అనుబంధం ఉంది. తెలుగు సినిమాల్లో డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేసిన అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ లో సరోజ్ ఖాన్ పాత్ర కూడా ఉంది.

IHG

 

చిరంజీవి సినిమాల్లో ‘చూడాలని ఉంది.. డాడీ’ సినిమాల్లో కొన్ని పాటలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ముఖ్యంగా చూడాలని ఉందిలో ‘ఓ మారియా.. ఓ మారియా..’ పాట బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాలో చిరంజీవికి అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు సరోజ్ ఖాన్. పాటలో చిరంజీవి నడుము లయబద్దంగా తిప్పుతూ సౌందర్య చుట్టూ తిరుగుతూ చేసే డ్యాన్స్ మూమెంట్ ఓ అద్భుతం. ఆ స్టెప్ కు చిరంజీవి మార్క్ హావభావాలు ఓ ఎస్సెట్. మణిశర్మ స్పీడ్ బీట్ కు తగ్గ డ్యాన్స్ స్టెప్స్ ఆ పాటలో ఇచ్చారు సరోజ్ ఖాన్.

IHG

 

ఈపాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సరోజ్ ఖాన్ కు నంది అవార్డు కూడా వచ్చింది. డాడీ సినిమాలో చిరంజీవి డ్యాన్సర్. ఈ సినిమాలో కూడా అద్భుతమైన స్టెప్స్ తో కాన్సెప్ట్ కు తగ్గ కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవిలోని ఎనర్జీని బేస్ చేసుకుని ఆమె ఇచ్చిన డ్యాన్స్ మూమెంట్స్ తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సరోజ్ ఖాన్ ఈరోజు ముంబయ్ లో హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. ఆమె లేకపోయినా హిందీ, తెలుగు సినిమా పాటలతో జీవించే ఉంటారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: