గతంలో స్టార్ హీరోల సినిమాలు అనగానే స్టార్ నటులు ఎక్కువగా ఉండే వారు అనే సంగతి తెలిసిందే. స్టార్ నటులు లేకుండా సినిమా అనేది ఉండేది కాదు. అదే విధంగా స్టార్ డాన్స్ మాస్టర్ లు స్టార్ రచయితలు ఇలా ఉండే వారు. రచయితల పరిస్థితి పక్కన పెడితే డాన్స్ మాస్టర్లకు కాస్త ఇప్పుడు గడ్డు కాలమే. సినిమాల్లో ఎక్కువగా డాన్స్ లేకుండా కథతో నెట్టుకుని వచ్చే విధంగా టాలీవుడ్ లో వాతావరణం మారుతుంది అని అంటున్నారు. అవును స్టార్ హీరోల సినిమాల్లో ఇక నుంచి స్టార్ డాన్స్ మాస్టర్ లు ఉండే అవకాశాలు చాలా వరకు తక్కువ అనే విషయం అర్ధమవుతుంది. 

 

జానీ మాస్టర్ అని మరొకరు అని ఉండే వారు. ఇప్పుడు వారిని పక్కన పెట్టే ఆలోచనలో స్టార్ దర్శక నిర్మాతలు ఉన్నారు. ఎందుకు అంటే వారు భారీగా డిమాండ్ చేయడమే. ఒక వేళ వాళ్ళు కాస్త తగ్గి సినిమా చేస్తాను అంటే కచ్చితంగా సినిమాలో చేయడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఖర్చు విషయంలో గతంలో మాదిరిగా పరిస్థితి ఉండేది కాదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు వారిని పక్కన పెట్టడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. 

 

అందుకే వాళ్ళు కూడా పెద్దగా డిమాండ్ చేయడం లేదు అని సమాచారం. వాళ్ళు కూడా చాలా వరకు  పరిస్థితిని అర్ధం చేసుకుని అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూడాలి. ఇక వాళ్ళు లేకపోతే కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఎం జరుగుతుంది ఎవరి భవిష్యత్తు ఏంటీ అనేది కరోనా నిర్ణయించే పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: