అగ్ర హీరోల సినిమాల విషయంలో గతంలో చాలా వరకు టాప్ నటులనే దర్శక నిర్మాతలు ఎంపిక చేసిన పరిస్థితి అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. స్టార్ హీరోలు అయినా మరొకరు అయినా సరే అగ్ర నటులను తీసుకుంటే సినిమాకు ఒక రేంజ్ ఉంటుంది అనే భావన లో అప్పట్లో దర్శక నిర్మాతలు ఉండే వారు. అందుకే ఇతర భాషల నుంచి ఎక్కువగా తీసుకుని వచ్చే వారు నటులను. కాని ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇతర భాషల నుంచి నటులను తీసుకుని వచ్చి వారికి భారీగా ఇచ్చే వాతావరణం అయితే లేదు అనే చెప్పాలి. 

 

స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాను పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనే సంగతి స్పష్టంగా చెప్పవచ్చు. ఇక చాలా వరకు హీరోయిన్ ల ఖర్చు నుంచి వాళ్ళ అమ్మలు అక్కలు నాన్నలు ఇతరత్రా పాత్రల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి. దీనికి కారణం సినిమా ఇప్పుడు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులే. అందుకే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

నానీ అయినా మరో చిన్న హీరో అయినా సరే బడ్జెట్ తగ్గించాలి. పెద్ద హీరోలు ఎవరు అయిన సరే డిమాండ్ చేయవద్దు. నిర్మాతను అర్ధం చేసుకుని అడుగులు వెయ్యాల్సి ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా సినిమాల్లో హీరో మినహా మరో స్టార్ ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: