టాలీవుడ్ ఉన్న యువ హీరోలు ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగానే సినిమాలు చేసే పరిస్థితి అయితే  ఉంది అని చెప్పాలి. గతంలో మాదిరిగా వాళ్ళు ఏ కథ పడితే ఆ కథను ఓకే చేసి సినిమా చేయడానికి రెడీ అయ్యే వాతావరణం అయితే లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అంటే గతం లో మాదిరిగా సినిమాలు ఒకటి ఫ్లాప్ అయినా మరొకటి హిట్ అవుతుంది లే అనే వాతావరణం అయితే దాదాపుగా ఉండదు అనేది చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే మరో సినిమా చేసే  పరిస్థితి ఉండదు. 

 

ఎందుకు అంటే నిర్మాతలు ఖర్చు విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో మాదిరిగా స్వేచ్చగా పెట్టుబడి పెట్టేసి సినిమాలను వేగంగా పూర్తి చేసి  ఒక సినిమా నష్టం వస్తే ఇంకో సినిమాలో తీసుకుని చేద్దాం అనే విధంగా అయితే వాతావరణం లేదు అనేది అర్ధమవుతుంది. కాబట్టి ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి కథలను ఓకే చేసుకోవాలి. ఒక సినిమా హిట్ అయితే భవిష్యత్తు ఉంటుంది. ఒక్క సారి నిర్మాత నష్టపోతే మాత్రం భవిష్యత్తు ఉండటం అనేది చాలా వరకు కష్టం అనే విషయం ఎవరు అయినా సరే తెలుసుకుని సినిమాలు చెయ్యాల్సి ఉంటుంది. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా సరే అదే పరిస్థితి ఉంది అని చెప్పాలి. అందుకే స్టార్ హీరోల సినిమాలు చేసే నిర్మాతలు కూడా ఇప్పుడు ఆలోచన చేసి సినిమాకు ఖర్చు చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు  అంటున్నారు. అవి అన్నీ తెలుసుకుని మెలగాల్సిన అవసరం చిన్న హీరోలకు ఉంది అని చెప్పాలి. మరి ఎప్పుడు తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చి హీరోలకు మంచి రోజులు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: