మన తెలుగు లో ఇప్పుడు దాదాపుగా సినిమాల భవిష్యత్తు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ సినిమాలో హీరో నుంచి చిన్న నటుడి వరకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కరోనా దెబ్బకు టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల మార్కెట్ అనేది నానా రకాల బాధలు పడుతుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన తెలుగు లో వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే సినిమాల్లో ఇక నుంచి యాక్షన్ సన్నివేశాలు ఉండటం కష్టమే అని స్టార్ దర్శక నిర్మాతలు అంటున్నారు. 

 

గతంలో యాక్షన్ సన్నివేశాలు అనగానే భారీగా ఖర్చు చేసి సినిమాను చేసే వారు. కాని ఇప్పుడు అలా లేదు కదా... కరోనా దెబ్బకు నిర్మాతలు దర్శకులు హీరోలు కూడా భారీగా నష్టపోయిన పరిస్థితి మన తెలుగు లో ఉంది. అందుకే ఇప్పుడు సినిమాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి అడుగు వేస్తున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాలు భారీ ఫైట్ లు విదేశాలలో ఫైట్ లు ఉండే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. సాధారణ పరిస్థితి వచ్చే  వరకు కూడా ఇప్పుడు అలాంటి వాతావరణం ఉండే అవకాశం లేదు. 

 

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఫైట్ రిచ్ గా ఉండాలి మరొకరకంగా ఉండాలి అని డిమాండ్ చేయడం కూడా దాదాపుగా అనవసరం అనే అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు నిర్మాతలు సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉండవు అని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా డిమాండ్ చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు మరి. చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: