మన తెలుగులో గతంలో సినిమాల విషయంలో కొన్ని కొన్ని విషయాలు బాగా హైలెట్ అయ్యేవి. పాటల కోసం  అంత ఖర్చు చేసారు ఇంత ఖర్చు చేసారు...  పాటల కోసం అక్కడ ప్లాన్ చేసారు ఇక్కడ ప్లాన్ చేసారు అని. కాని ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా ఉండే అవకాశం లేదు అని అంటున్నారు మరి. అవును పాటల కోసం సినిమాల్లో ఇప్పుడు భారీగా ఖర్చు చేసే అవకాశం గాని భారీగా ఇచ్చుకునే అవకాశం గాని ఉండదు అనే చెప్పాలి. ఎందుకు అంటే సినిమా ఇప్పుడు నానా కష్టాల్లో ఉంది. 

 

కథలో కాస్త పట్టు ఉండి సినిమాను పూర్తి చేసే విధంగా ఉంటే చాలు అని పాటలు అనేది తర్వాత సంగతి అనేది అర్ధమవుతుంది. విదేశాల్లో షూటింగ్ అంటే ఇప్పుడు కష్టమే. అది కూడా విదేశాల్లో పాటల షూటింగ్ అంటే ఇక మరీ కష్టం అనే విషయం అర్ధమవుతుంది. ఏ హీరో అయినా ఏ నిర్మాత అయినా సరే ఇప్పుడు చాలా వరకు భవిష్యత్తు గిరించి పోరాటం చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఏ సినిమా చేసినా సరే టాలీవుడ్ లో ఇప్పుడు ఖర్చు అనేది లేకుండా చేస్తున్నారు. అందుకే పాటల విషయంలో చాలా వరకు తగ్గి చేసే ఆలోచనలోనే ఉన్నారు అనేది అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు రెండు మూడేళ్ళ పాటు ఇదే వాతావరణం సినిమాలకు ఉండవచ్చు అనేది అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు అయినా మరొకరు అయినా సరే సినిమాల విషయంలో నిర్మాతలను అర్ధం చేసుకోవాలి. పాటలు ఉండాలి అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అని గతం లో మాదిరిగా డిమాండ్ చేస్తే మాత్రం ఇప్పుడు అంత సీన్ కూడా నిర్మాతలకు  లేదు అని అర్ధం చేసుకుని అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: