మన తెలుగు లో స్టార్ హీరోల సినిమాలు అనగానే చాలా వరకు గతంలో కొన్ని కొన్ని కోణాలు ఎక్కువగా ఉండేవి. సినిమాలో ఉండే కొన్ని సీన్స్ విషయంలో రిచ్ గా ఉండాలి అనే విధంగా ప్లాన్ చేసే వారు దర్శక నిర్మాతలు. ఆ రిచ్ అనే కోణం లేదు అంటే మాత్రం సినిమా ఫ్లాప్ అవుతుంది అనే భావన ఉండేది. అందుకే చాలా వరకు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుని రిచ్ అనే కోణం చూపించే వారు. ఏమీ లేదు హీరో విదేశాల్లో ఉండాలి హీరోయిన్ ఇక్కడ ఉండాలి. హీరో అక్కడ ఎక్కడో చదవాలి. అక్కడి బీచ్ లో తిరగాలి. ఖరీదు గా ఓడలలో తిరగాలి వంటి కోణాలు ఎక్కువగా ఉండేవి. 

 

కాని ఇప్పుడు కారు నుంచి ప్రతీ ఒక్కటి కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు అనే విషయం స్పష్టం గా చెప్పావచ్చు. ఎందుకు అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి అసలు వస్తుందా రాదా అనే విధంగా ఉంది వాతావరణం.  ఇప్పుడు భారీగా సినిమాకు ఖర్చు చేసి పెట్టిన పెట్టుబడి రాలేదు అంటే పడే  బాధలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకే చాలా  వరకు కూడా అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే అదే పరిస్థితి. 

 

ఇక విదేశాల్లో షూటింగ్ లు లేవు, రిచ్ గా ఉండే సన్నివేశాలు ఉండవు, హీరోల కోసం భారీ ఫైట్స్ ఉండవు. యాక్షన్ సీన్ లు అసలే ఉండవు. ఎందుకు అంటే ఇప్పుడు సినిమా ఇబ్బంది పడుతుంది. ఆర్ధికంగా నిర్మాతలు నానా రకాల బాధలు పడుతున్నారు అనేది అందరికి అర్ధమవుతుంది. అందుకే జాగ్రత్తలు పడుతున్నారట స్టార్ హీరోలు నిర్మాతలు దర్శకులు అందరూ కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: