బాలనటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వంతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మహేష్, ఆ వయసులోనే తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. ఆపై వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగిన మహేష్, కొన్నాళ్ల తరువాత వచ్చిన బాలచంద్రుడు తో సినిమాలకు కొంత విరామం పలికారు. అనంతరం కొన్నేళ్ల తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడిని అని నిరూపించుకున్నారు. ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు అందుకున్న మహేష్, మధ్యలో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశారు. 

IHG

ఆరడుగులకు పైగా ఎత్తు, చూడచక్కని రూపం, హాలీవుడ్ హీరోలకు తీసిపోని అందం, అద్భుతమైన అభినయం మహేష్ కు ఎందరో కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. తండ్రి అభిమానగణంతో పాటు మహేష్, తన ఛరిష్మాతో మరెందరో అభిమానులను సంపాదించారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తన కెరీర్ తొలి నాళ్ళలోనే మహేష్ కు అటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుండి కూడా ఆయనకు ఎన్నో బాలీవుడ్ ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా మహేష్ మాత్రం అక్కడికి వెళ్లేందుకు మొగ్గుచూపలేదు. రాను రాను ఆయనకు హిట్స్ తో పాటు నార్త్ సహా తమిళ్, మళయాళం, కన్నడ వంటి పలు ఇతర భాషల ఇండస్ట్రీల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడసాగింది. 

 

అంతేకాక టాలీవుడ్ తో పాటు ఎందరో బాలీవుడ్ సినిమా ప్రముఖుల్లో కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి మహేష్ బాబు కనుక ఈ పాటికి ఒక బాలీవుడ్ సినిమా చేసి ఉంటె, ఆయన క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా అమాంతం పెరిగి ఉండేదని, ఒకవేళ ఆయన రాబోయే రోజుల్లో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి, అక్కడ రెండు లేదా మూడు మంచి హిట్స్ అందుకున్నట్లైతే, ఆయనని అందుకోవడం ఇతర హీరోలకు అంత సులువు కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు బాలీవుడ్ పై ఆసక్తి లేదని ఇప్పటికే తేల్చిచెప్పిన మహేష్, ఈ విషయమై రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: