థియేటర్లు ఓపెన్ ఎప్పుడన్నది తెలియని ఈ పరిస్థితుల్లో మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలన్ని ఓటిటి బాట పడుతున్నాయి. ఇక ప్రత్యేకంగా ఓటిటి రిలీజ్ కోసం కొన్ని వెబ్ మూవీస్ చేస్తున్నారు. అందులో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భనుమతి & రామకృష్ణ. శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, సలోని లూత్రా జోడీగా నటించారు. యశ్వంత్ నిర్మించిన ఈ సినిమాకు ష్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.

 

మూప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాని భానుమతి.. బోయ్ ఫ్రెండ్ తో విడిపోయి తన ఆలోచనలకు.. తన క్యారక్టర్ కు ఏమాత్రం సూట్ అవని రామకృష్ణకు దగ్గరవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమా ఇలా తమని తామే ఆలోచనలో పడేసుకుని కలుస్తూ, విడిపోతూ ఫైనల్ గా ఒక్కటవుతారు. దర్శకుడు ఈ గొప్ప కథ ఏమి రాసుకోలేదు కాని పాత్రల స్వాభవంతో కథనం నడిపించి మెప్పించాడు. అవసరమైన చోట కామెడీ అదికూడా కథలో భాగంగానే ఇలా అన్నిటిని సమపాళ్లలో చూపించాడు.

 

క్లైమాక్స్ కొద్దిగా రొటీన్ అనిపించినా ఫైనల్ గా నవీన్ చంద్ర, సలోని కలిసి నటించిన భానుమతి & రామకృష్ణ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా థియేటర్ లో వస్తే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఓటిటి లో వరకు మాత్రం మంచి టైం పాస్ మూవీగా వెళ్తుంది. నవీన్ చంద్రకు ఈ సినిమా సక్సెస్ మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు. అందాల రాక్షషి సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలబడటానికి కష్టపడుతున్న నవీన్ చంద్ర ఈమధ్య కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేస్తూ వచ్చాడు. మరి ఫైనల్ గా ఓటిటిలో మొదటి ప్రయత్నం చేసిన నవీన్ చంద్రసక్సెస్ ను ఎంజాయ్ చేస్తాడని చెప్పొచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: