ఇలియానా అంటే అందరికి గుర్తొచ్చేది తన బెల్లి డాన్స్. ఇలియానాకే తన నడుమంటే చాలా ఇష్టమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఏ దర్శకుడైన సినిమాలో ఒక్క సాంగ్ లో అయినా ఇలియానాతో బెల్లి డాన్స్ చేయిస్తారు. ఇక ఇలియానా కూడా చాలా హుషారుగా బెల్లీ డాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది. వై.వి.ఎస్.చౌదరీ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రాం నటించిన 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ లో  అడుగు పెట్టింది ఇల్లి బేబీ. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

ఇక తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని ఒక వెలుగు వెలిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు వరస బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఇలియానా అందుకుంది. అంత స్టార్ డం ని సంపాదించుకున్న లియానా  టాలీవుడ్ లో ఊపిరాడనంతగా సినిమాలు చేస్తూ కూడా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. బర్ఫీ లాంటి సినిమాతో బాలీవుడ్ లోను క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే వరసగా ఫ్లాప్స్ రావడంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇలియానా కెరీర్ పూర్తిగా దెబ్బ తినింది. దాంతో మేకర్స్ పక్కన పెట్టేశారు.

 

అయితే రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఇలియానా టాలీవుడ్ లో మళ్ళీ ఫాం లోకి వస్తా అనుకున్న నమ్మకం కాస్తా పోయింది. ఇక ఇలియానా నటించిన 'ది బిగ్ బుల్' సినిమా ఓటీటీ లో రిలీజ్ కాబోతుండగా నాగార్జునతో కలిసి ఇలియానా బాలీవుడ్ రిమేక్ రైడ్ లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాదు దాదాపు ఈ సినిమాలో ఇలియానా ఫైనల్ అన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఇలియానా నే హీరోయిన్ గా నటించింది. అందుకే ఇక్కడ కూడా నాగార్జున ఇలియానా నే తీసుకోవాలని భావిస్తున్నారట. దాంతో ఇలియానా చాలా నమ్మకంగా ఉనంట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: