స్వరవాణి కీరవాణి గురించి మనతెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1990లో వచ్చిన మనసు మమత సినిమాతో ప్రారంభమయిన కీరవాణి సంగీత జీవితం, అక్కడి నుండి ఒక్కొక్క సినిమా అవకాశం తో ముందుకు సాగింది. ఆ తరువాత అత్తింట్లో అద్దెమొగుడు, సీతారామయ్య గారి మనవరాలు, పీపుల్స్ ఎన్కౌంటర్ వంటి సినిమాలు చేసిన కీరవాణి, ఒక్కో సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. ఇక ఇప్పటివరకు తెలుగు సహా, హిందీ భాషలో కూడా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కీరవాణికి ప్రముఖ టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి స్వయానా తమ్ముడు అనే విషయం తెలిసిందే. 

IHG

ఇకపోతే తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ప్రస్తుతం తాను తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ రౌద్రం రణం రుధిరం సినిమా వరకు కూడా ప్రతి సినిమాకు కూడా అన్న కీరవాణినే సంగీత దర్శకుడిగా తీసుకుంటూ వస్తున్నారు రాజమౌళి. అయితే ఈ విషయమై పలు సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ, తనకు మ్యూజిక్ సెన్స్ అంతగా లేదని, అదే అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తే నా సినిమాకు మరింత మంచి అవుట్ ఫుట్ వస్తుందని ఆయనను సంగీత దర్శకుడిగా తీసుకుంటానని, అదీకాక తనతో చేసే ప్రతి ఒక్క సినిమాకు అన్నయ్య కీరవాణి, తాము అనుకున్న స్థాయికి మించేలా అవుట్ ఫుట్ ఇస్తూ వస్తున్నారని చెప్పడం జరిగింది. 

 

అలానే కీరవాణి మాట్లాడుతూ, తమ్ముడు రాజమౌళి తో వర్క్ చేసేటపుడు కూడా మిగతా దర్శకుల దగ్గర మాదిరిగానే వర్క్ చేస్తానని, అలానే తప్పకుండా సినిమా విజయవంతం అయ్యేందుకు తనవంతుగా కృషి చేస్తుంటానని అంటారు. ఇలా మొదటి నుండి వీరిద్దరి మధ్య అనుబంధం ఎంతో గొప్పగా సాగుతోంది. వాస్తవం చెప్పాలంటే రాజమౌళి, కీరవాణి ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా ఎంత అన్నదమ్ములు అయినప్పటికీ కూడా పని విషయంలో మాత్రం ఎవ్వరూ కూడా కాంప్రమైజ్ కాకుండా కష్టపడతారని, అలానే సినిమా సమయం పూర్తి అవ్వగానే ఎప్పటికప్పుడు కలుసుకుని కుటుంబ విషయాలు ఎంతో ఆనందంగా పంచుకుంటుంటారని, ఆ విధంగా వారిద్దరి మధ్య అనుబంధం మాటల్లో చెప్పలేనిదని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: