కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కెజిఎఫ్ సినిమా ఎలాటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కేవలం కన్నడ భాషలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో అయితే షారుఖ్ సినిమాను సైతం బాక్సాఫీస్ రేసులో ఓడిచింది కెజిఎఫ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా కెజిఎఫ్. శ్రీనిది శెట్ట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో డైలాగ్స్, యాక్షన్స్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్ని అద్భుతంగా కుదిరాయి.

 

ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ సెట్స్ మీద ఉంది. కెజిఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఆ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండాన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలాఉంటే తెలుగు తెర మీద కెజిఎఫ్ అద్భుతాలు సృష్టించింది. యశ్ కు ఇక్కడ ఒక్క సినిమాతో స్టార్ డం వచ్చింది. ఇక కెజిఎఫ్ సినిమా జూలై 5న వరల్డ్ ప్రీమియర్ వేస్తున్నారు. బుల్లితెర మీద మొదటిసారి ఈ సినిమా టెలికాస్ట్ అవుతుంది. స్టార్ మా భారీ మొత్తం ఇచ్చి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసింది.

 

జూలై 5 ఆదివార ఈ సినిమా స్టార్ మాలో రాబోతుంది. వచ్చేది టివిలో అయినా అక్కడ ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంచనాలు వేస్తున్నారు. కెజిఎఫ్ లోని కొన్ని డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అమ్మ గురించి.. మమతల ఒడిలో సాంగ్.. ఇలా ఎమోషనల్ గా కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. కెజిఎఫ్ స్మాల్ స్క్రీన్ పై కూడా భారీ టి.ఆర్.పి తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.       

మరింత సమాచారం తెలుసుకోండి: