సినిమాల్లో గ్యాంగ్ స్టర్ కార్యాకలాపాల గురించి తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు వెళ్లగా.. అప్పటికే ఈ విషయం పసిగట్టిన ఆ గ్యాంగ్ విచక్షిణారహితంగా కాల్పులు జరపడం... అందులో పోలీసులు గాయపడి చనిపోవడం చూస్తుంటాం.. అచ్చం ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆ రౌడీలు ముందే మాటువేశారు. పోలీసుల వాహనం వెళ్తున్న దారిలో జేసీబీని అడ్డుగా పెట్టారు. వారు కిందకి దిగగానే భవనాలు, ఇండ్లపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. 

IHG's Uttar Pradesh

గ్యాంగ్ స్టర్స్ జరిపిన కాల్పుల్లో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఒక సాధారణ పౌరుడు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. అనంతరం ఆ రౌడీ షీటర్లు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు.  విషయం తెలుసుకొని  కాన్పూర్‌ అడిషనల్‌ డీజీపీ జయనారాయణ్‌ సింగ్‌, కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చంపిన  వికాస్‌దూబే గ్యాంగ్‌ కోసం తీవ్ర స్థాయిలో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌లో వికాస్‌దూబే గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు రౌడీలు ఎన్ కౌంటర్ చేశారు.

IHG

మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పెన్సన్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన పోలీసులకు నివాళులర్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ వెళ్లారు. సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరస్తులపై ఉక్కపాదం మోపుతున్నారు యోగి ఆదిత్యనాధ్.

మరింత సమాచారం తెలుసుకోండి: