టాలీవుడ్ లో ఒకప్పుడు ఆయనో క్రేజీ డైరక్టర్. ఆయతో సినిమాకు స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించే వారు. కాని వరుస ఫ్లాపులు ఆయన్ను కెరియర్ లో వెనకపడేలా చేశాయి. అంతేకాదు ఆ హీతో సినిమా అంటే బాబోయ్ అనేలా చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు కామెడీ టచ్ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టే ఈ డైరక్టర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఓ ఫ్లాప్ హీరోతో సినిమా మొదలుపెడుతున్నాడు. ఆల్రెడీ ఆ హీరోతో సూపర్ హిట్ తీసిన ఈ డైరక్టర్ ఇప్పుడు అదే హీరోతో ఆ సినిమా సీక్వల్ నే చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ప్రముఖ నిర్మాతసినిమా నిరంస్తుండగా ఈ సినిమాకు ఆ డైరక్టర్ నెల జీతానికి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అదేంటి అంటే వరుస ఫ్లాపులతో అసలేమాత్రం ఫాం లో లేని ఈ డైరక్టర్ కు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. ఒకప్పుడు సినిమాకు 7,8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే ఈ డైరక్టర్ ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీవితంతో సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. త్వరలోనే ముహుర్త కార్యక్రమాలు పెట్టుకుంటారట. 

 

దాదాపు తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో సినిమా చేసిన ఆ డైరక్టర్ పరిస్థితి మరీ ఇంత దిగజారిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. ఒకే పంథా సినిమాలు చేయడంతో ఆ డైరక్టర్ సినిమాలను ప్రేక్షకులు తిప్పికొట్టారు. రెండేళ్ల క్రితం చివరగా ఓ మాస్ హీరోతో సినిమా చేసినా అది కూడా వక్ అవుట్ కాలేదు. అందుకే తన సూపర్ హిట్ సినిమా సీక్వల్ తో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా గురిచి మిగతా అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. హీరో అయినా.. డైరక్టర్ అయినా ఫాం లో ఉన్నప్పుడే కోట్లిచ్చి కొనుక్కుంటారు. కాని ఫ్లాపుల్లో ఉంటే మాత్రం ఇలాంటి పరిస్తితే వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: