ఎం ఎం కీరవాణి.. ఈ పేరు వింటేనే సంగీత ప్రేమికులు అందరూ ఉర్రూతలూగి పోతారు. ఈ దర్శకుడు అందించిన మెలోడీ పాటలు భక్తి పాటలు రక్తి పాటలు విని మైమరచిపోతూ ఉంటారు సంగీత ప్రేమికులు. అన్ని రకాల సంగీత ప్రేమికులకు సరిపడా పాటలను అందించి అద్భుతమైన క్రేజ్ను సంపాదించారు ఎమ్.ఎమ్.కీరవాణి. తెలుగు చిత్ర పరిశ్రమలో మెలోడీ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి... తన మెలోడీ సాంగ్స్ తో  తెలుగు ప్రేక్షకులందరినీ మైమరపింప  చేశారు అనడంలో అతిశయోక్తి లేదు, మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి. అయితే ఎమ్.ఎమ్.కీరవాణి కి ఎక్కువగా సాన్నిహిత్యం ఉండే  హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్.



 కేవలం ఎమ్.ఎమ్.కీరవాణి కాదు రాజమౌళి కుటుంబానికి కూడా ప్రభాస్ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ ఎంత నిరాడంబరంగా ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో ఎంత స్టైల్ గా  ఉంటారో  బయట మాత్రం అంతకంటే నిరాడంబరంగా ఉంటారు ప్రభాస్, అయితే ఎమ్.ఎమ్.కీరవాణి ఒకానొక సమయంలో ప్రభాస్ గురించి తనదైన శైలిలో వివరించారు,



 బాహుబలి ఆడియో రిలీజ్ టైం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఏది చేతకాదు.. నిజంగానే ఆయనకు ఏది చేత... ఎందుకంటే టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ... హీరోల పోస్  కొట్టడం ప్రభాస్ కు  చేతకాదు... స్టైలిష్ గా కనిపించాలి అని అనుకోవడం ప్రభాస్ కు  చేతకాదు... హీరోలకి  ఉండే ఇగో చూపించడం ప్రభాస్ కు  చేతకాదు, ప్రభాస్ కి  చేతనయిందల్లా  ఒక్కటే అందర్నీ నవ్వుతూ పలకరించడం అందరూ మనవాళ్ళే అనుకోవటం... అందుకే తెలుగు ప్రేక్షకులందరికీ ప్రభాస్ డార్లింగ్ గా మారిపోయాడు అంటూ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: