టాలీవుడ్ లో కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరి సంగీతం గురించి,  వారు అందించే పాటల గురించి వారు చేసే సినిమాల గురించి అసలు అవసరం లేదు.  ఏ సినిమా చేసినా ఏ పాటకు సంగీతం అందించినా సరే ఆ పాట రేంజ్  పెరగడం ఆ సినిమా రేంజ్ పెరగడం అనేది మనం చూస్తూనే ఉంటాం. స్టార్ హీరోలతో చేసే సినిమాలు అయినా చిన్న హీరోలతో చేసే సినిమాలు అయినా సరే... పెద్ద హీరోలతో చేసే సినిమాలు అయినా సరే వాటి రేంజ్ మరో స్థాయిలో ఉంటుంది. ఇక టాలీవుడ్ లో కీరవాణి గురించి  ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

 

ఆయన సంగీతం అనగానే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అసలు లేదు అనే చెప్పాలి. ఆయన కోసం దర్శకులు సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటారు. ఆయన సంగీతం కోసం ఎన్నో సినిమాల షూటింగ్ లను దర్శకులను ఒప్పించి వాయిదా వేసారని అంటూ ఉంటారు. నిర్మాతలు కూడా ఆయన కోసం ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అగ్ర దర్శక నిర్మాతలు అయితే ఆయనను ఎక్కడా కూడా  బలవంతం చేసిన సందర్భం లేదు.  రాఘవేంద్ర రావు బాపు లాంటి వారు కూడా ఆయన సంగీతం కోసం ఎదురు చూసారు అంటే ఆయన డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

అప్పటి హీరోలు చాలా మంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండే వారట. ఇక అది అలా ఉంటే హీరోయిన్ లు అయితే ఆయన సంగీతం ఉంది అంటే చాలు సినిమా చేయడానికి ఆసక్తి చూపించే వారు. వారి అందాలను ఆయన సంగీతం తో చెప్పిన పాట లు కూడా ఉన్నాయని అంటారు సినీ ప్రేక్షకులు. ఆ విధంగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: