మన తెలుగులో స్టార్ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఆయన సంగీతం అనగానే చాలా మందికి ఒక క్రేజ్ ఉంటుంది. అది మన తెలుగు లో మాత్రమే కాదు ఇతర భాషల్లో అని కూడా అంటున్నారు ఆయన సంగీతాన్ని ప్రేమించిన వారు. అవును ఆయన సంగీతం కోసం ఇతర భాషల్లో కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఇతర భాషల్లో ఉండే స్టార్ హీరోలు కూడా ఆయన సంగీతం కోసం తెలుగులో సినిమాలు చెయ్యాలి అని అనుకున్నారు ఐ అలాగే అక్కడ కూడా... ఆయన తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అని అంటారు. 

 

తమిళం లో స్టార్ హీరోలు కూడా ఆయన తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చి ఆయన కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఆయన  విషయంలో ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోలు కూడా సానుకూలంగా ఉండి యువ దర్శకుల కంటే ఆయన మంచి సంగీతం అందిస్తారు అని కూడా భావిస్తూ ఉంటారు. అందుకే తమ తమ సినిమాలకు ప్రభాస్  లేదా పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి ఉంది అని అంటున్నారు.  అప్పట్లో ఆయన సంగీతం కోసం మోహన్ బాబు అయితే  ఫోన్ చేసే వారు అని, 

 

అయినా సరే ఖాళీ లేదు అని ఆయన  డేట్స్ ని వాయిదా కూడా వేసారు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే... టాలీవుడ్ లో ఇప్పటికి కూడా ఆయనకు అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. స్టార్ దర్శకుడు రాజమౌళి గాని క్రిష్ గాని ఆయన తో సినిమా చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. క్రిష్ తన సినిమాలో ఆయననే తీసుకున్నారు పవన్ తో చేసే సినిమాలో. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: